Videos

పడి లేచే కెరటమే హృతిక్‌కు ఆదర్శం

the rise of hrithik roshan post injuries

హృతిక్‌ ప్రమాదవశాత్తు పలుమార్లు షూటింగ్‌లలో గాయపడ్డారు. 2018లో హృతిక్‌ కుడి కాలి మడమకు తీవ్ర గాయమైంది. దాన్నుంచి కోలుకునే క్రమంలో ఆయన ఎంతో శ్రమించారు. నొప్పిని దిగమింగుకుని.. కఠోర సాధన చేశారు. ఇలా కొన్ని నెలల నుంచి తన ప్రయాణం సాగుతోందంటూ హృతిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనలా గాయపడ్డ వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావించి పంచుకున్నట్లు ‘క్రిష్‌’ చెప్పారు. ‘నా శరీరాన్ని తిరిగి కండీషన్‌లో పెట్టడానికి దాదాపు 10 నెలలుగా పనిచేస్తున్నా. ఇప్పటికీ ఆ ప్రక్రియలోనే ఉన్నా. కుడికాలి మడమకు గాయమైంది, వెన్నెముక డిస్క్‌లో సమస్య ఉంది. నా ఆరోగ్య పరిస్థితి గందరగోళంగా మారింది. పైకిలేచి పరిగెత్తు అని నేను చెబుతున్నా.. నా శరీరం వినలేదు. కాలు, వెన్ను కదల్చలేకపోయా. రోజు రోజుకూ బరువు పెరిగిపోయా. పెద్ద బరువులు ఎత్తకూడదు. ఒక్క డైట్‌ మాత్రం నా కంట్రోల్‌లో ఉంది. డైట్‌లో భాగంగా ఇష్టమైన ఆహారం తీసుకోకుండా ఉన్నా.. దీంతో ఇంకా ఫ్రస్ట్రేషన్‌ వచ్చింది. ఈ ప్రయాణంలో తీసిన కొన్ని క్లిప్స్‌ను మీకు షేర్‌ చేశా. తక్కువ బరువులు లిఫ్ట్‌ చేయడం, బ్యాండ్‌ వర్క్‌.. ఇలా వివిధ టెక్నిక్‌లు పాటించా. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే… రోజు వారి అభివృద్ధిని పుస్తకంలో రాసిపెట్టుకున్నా. తర్వాతి రోజు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలనే లక్ష్యం పెట్టుకున్నా. నాలా గాయపడ్డ వారికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. నేను గాయాల నుంచి చాలా నెమ్మదిగా కోలుకుంటూ వచ్చా. మూడు నెలల సాధన తర్వాత కాస్త ఫలితం కనిపించింది. దీన్ని పూర్తి చేయగలనా అని నాపై నాకే అనుమానం కల్గింది, కానీ ఓ మేజిక్‌ తరచూ నన్ను ముందుకు నడిపించింది’ అని హృతిక్‌ పోస్ట్‌ చేశారు.
https://www.youtube.com/watch?v=0pLz5hDsydE