హిందూ సంప్రదాయంలో భాగంగా ప్రతి మంచి పనిలోనూ పసుపును వినియోగిస్తుంటారు. శుభకార్యాలలో, యజ్ఞదీక్షా సమయాల్లో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆరవేయడం అనాదిగా వస్తున్న ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలను ఇతరులకు ఇవ్వకూడదు. నూతన వస్త్రాలే ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పాతవైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్త బట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు. ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు. పసుపు క్రిమి సంహారిణి. అనేక చేతులు మారి వచ్చే కొత్తబట్టల్లో ఎటువంటి క్రిములున్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్నా ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుందని భావిస్తుంటారు.
కొత్తబట్టలకు పసుపు ఎందుకు రాస్తారు?
Related tags :