తెరాస పార్టీ 18 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కువైట్ లో TRS NRI Kuwait అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించారు. తెరాస అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల ప్రకారం తెరాస ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనల మేరకు కువైట్ లో తెరాస ఎన్ఆర్ఐ కువైట్ కమిటీ 18 వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కువైట్ తెలంగాణ వాసులు హాజరు అయ్యారు. ఈ వేడుకల్లో పలువురు కువైట్ ప్రవాసులు ఎన్నారై తెరాస సభ్యత్వం తీసుకున్నారు. వీరిని తెరాస కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గొడిశాల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెవిన్యూ మునిసిపల్ శాఖలలో పేరుకు పోయిన అవినీతిని అంతం చేస్తూ రైతన్నలకు లబ్ధిదారులకు అభివృద్ధి ఫలాలను అందించడానికి సీఎం కెసిఆర్ కొత్త చట్టాలని తీసుకురావడం అభినందనీయం అని కువైట్ తెరాస శాఖ పేర్కొంది. కమిటీ సభ్యులు కొండల్ రెడ్డి, సురేష్ గౌడ్, రవి గన్నారపు, రమేష్ ఓరుగంటి, దివ్యరవి గరినే, ప్రమోద్, సయీద్ రెహమాన్, రాయిస్ తదితరులు పాల్గొన్నారు.
కువైట్‌లో ఎన్నారై తెరాస ఆవిర్భావ వేడుకలు
![trs formation grand celebrations in kuwait by nri trs trs formation grand celebrations in kuwait by nri trs](;https://i.imgur.com/wA9yCWW.jpg)
Related tags :