Movies

ఆమె-అతని గురించి

karan johar reveals kajol akshay secret

దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి కాజోల్‌ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వీరు ఒకరి రహస్యాల్ని ఒకరితో పంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా కాజోల్‌కు సంబంధించిన ఓ విషయాన్ని కరణ్‌ బయటపెట్టారు. ఆమెతో తనకు పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పారు. ‘కాజోల్‌ను ‘హెన్నా’ సినిమా ప్రీమియర్‌లో కలిశా. కాజోల్‌కు అక్షయ్‌ కుమార్‌ అంటూ చాలా ఇష్టం. అక్కడ ఆయన కనిపిస్తారేమో అని చూసింది. నేను ఆమెకు తోడుగా ఉన్నా. కానీ ఆయన కనిపించలేదు. అదే మా స్నేహానికి తొలిమెట్టు. ఇద్దరం దక్షిణ ముంబయిలో నివసించేవాళ్లం. దీంతో తర్వాత మా స్నేహం మరింత బలపడింది’ అని కరణ్‌ చెప్పారు. ఇదే సందర్భం గురించి కాజోల్‌ మాట్లాడుతూ.. ‘ప్రీమియర్‌కు కరణ్‌ త్రీ పీస్‌ సూట్‌లో వచ్చాడు. ఆయన్ను చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయా. ఏ వ్యక్తి ఇలాంటి దుస్తులు వేసుకుంటాడు అని ఆశ్చర్యపోయా’ అని చెప్పారు. కాజోల్‌ అలా అనడంతో కరణ్‌ కల్పించుకుంటూ.. ‘అప్పడు నాకు 17 ఏళ్లే. ఆ సూట్‌కు నేను సరిపోయా. డ్యాన్స్‌ చేద్దామని కాజోల్‌ తల్లి తను ఆంటీ నాతో అన్నారు. మేం డ్యాన్స్‌ చేస్తుంటే కాజల్‌ నావైపు చూసి దాదాపు అరగంట నవ్వింది. నాకు అవమానంగా అనిపించింది. నా జీవితంలో అంతగా ఎవరూ నన్ను అవమానించలేదు అన్న ఫీలింగ్‌ వచ్చేసింది.. పార్టీ నుంచి వెళ్లిపోయా’ అని చెప్పారు.