ఫొని తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ.. తుపాను గమనంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. నాన్ మెకానికల్ బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయని, వాటిని కూడా వెనక్కి రప్పిస్తున్నామని వివరించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మాక్ డ్రిల్ చేపట్టారని.. ఫొని తుపాను తీరం దాటి భూభాగం మీదకి వచ్చే అవకాశం లేదని తెలియజేశారు. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నానికి ఒక అంచనా వస్తుందని ఆయన స్పష్టంచేశారు. ఫొని తుపానుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రబీలో రైతులు మద్దతు ధర 1750 కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దన్నారు. ఎవరైనా ధర తగ్గిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు.
ఫణి తుఫాను పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు
Related tags :