సంపూర్ణ ఆరోగ్యంలో ఎముకల ఆరోగ్యమూ ఓ భాగమే. ఎముకల దృఢత్వానికి కాల్షియం, విటమిన్-డి అవసరం. వీటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్-కె ఎముకలు పెళుసుబారకుండా ఉండటానికి అత్యవసరం. కాల్షియం, ఫాస్ఫరస్‌లను పాలు, పెరుగు అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తుల నుంచి మాంసకృత్తులు లభిస్తాయి. సూర్యరశ్మి ద్వారా విటమిన్-డి అందుతుంది. విటమిన్-డితో ఫోర్టిఫై చేసిన పాలను తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్-డి రెండూ లభిస్తాయి. మొత్తంగా, సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి.
ఎముకల బలోపేతానికి విటమిన్ డీ అత్యావశ్యం
Related tags :