Movies

దేని రుచి దానిదే!

kajal shares her memories of roles

ఇప్పటికీ ఆ పాత్ర ప్రభావం నుంచి బయటికి రాలేకపోతున్నా అంటూ తాము చేసిన కొన్ని పాత్రల గురించి, సినిమాల గురించి చెప్పే నటీటుల్ని చాలామందినే చూస్తుంటాం. అయితే కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ మాత్రం తన వ్యక్తిగత జీవితంపై పాత్రల ప్రభావం కొంత వరకే అని చెబుతోంది. ‘‘పుష్కర కాలంగా సాగుతున్న నా ప్రయాణంలో నేను చేసిన ప్రతి కథ, పాత్ర కూడా నా మనసును తాకినదే. కథ వినేటప్పుడే ఆ పాత్రల్లో నన్ను నేను ఊహించుకొంటుంటా. ఒకొక్క పాత్ర ఒక్కో కొత్త జీవితాన్ని రుచి చూపిస్తుంటుంది. అలాంటి అనుభవం, అవకాశం నటులకి మాత్రమే ఉంటుందేమో. ప్రతి కథ, పాత్ర కూడా..ఆశ్చర్యం, సంతోషంతో పాటు భిన్నమైన అనుభూతులకి గురి చేస్తుంటాయి. అయితే ఆ పాత్రలు సినిమా సెట్‌ వరకే తప్ప, నా వ్యక్తిగత జీవితంలోకి ఎప్పుడూ రాలేదు. అందుకు కారణం నా కుటుంబమే అని నమ్ముతుంటా. సెట్‌లోకి వెళ్లాకే నేను నటిని. అక్కడి నుంచి బయటికొచ్చాక ఆ విషయమే మరిచిపోతా. కుటుంబమే నాకు ప్రపంచం. మొదట్నుంచీ నేను సున్నిత మనస్కురాలిని. నాలో భావోద్వేగాలు ఎక్కువ. అయితే వాస్తవికతతో కూడిన ఎన్ని పాత్రలు చేసినా.. సహజమైన ఆ వ్యక్తిత్వం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. దాని వల్ల మేలే జరిగింది. నటులు చేసిన పాత్ర నుంచి బయటికి రాకపోతే కొత్త కథల్లో ఇమిడిపోవడం కష్టం’’ అంది కాజల్‌. ‘సీత’లో నటిస్తోందామె.