Devotional

తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు

padmavathi parinayotsavam in tirumala on may 12th

తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలను మే 12 నుంచి నిర్వహించనున్నట్టు తితిదే తెలిపింది. మే 12 నుంచి 14 వరకు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే తెలిపింది. అదే విధంగా మే 7న అక్షయ తృతీయ, తిరుమల గంగమ్మ జాతర, శ్రీ పరుశురామ జయంతి, శ్రీ భృగు మహర్షి వేడుకలు జరగనున్నాయి. మే 9న శ్రీ శంకర జయంతి, శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ నమ్మాళ్వార్ ఉత్సవారంభం, 10న శ్రీ రామ జయంతి, 17న శ్రీ నృసింహ జయంతి, తరిగొండ వేంగమాంబ జయంతి, 18న శ్రీ కూర్మ జయంతి, శ్రీ అన్నమాచార్య జయంతి, 29న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.