పేద్ద ర్యాంప్.. చుట్టూ జనాలు.. క్లిక్‌మనిపిస్తూ కెమేరాలు.. ఫ్యాషన్ షో అంటే చాలా తతంగమే ఉంటుంది. పాప్‌సింగర్ రిహాన్నా మాత్రం ఈ ట్రెండ్‌ని తిరగరాసింది. ఏకంగా విమానాశ్రయంలోనే క్యాట్‌వాక్ చేసి ఫొటోషూట్ కూడా చేసేసింది. ఎంచక్కా పైలట్ దుస్తులు ధరించి హొయలు ఒలకబోసి ఆనక కురచ దుస్తులతో పిల్లినడకలు నడిచింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ అమేలియా ఇయర్‌హార్ట్‌కి నివాళిగా ఈ సొగసుల షో నిర్వహించిందట. అయితే ఇదేదో కొత్తగా ఉందని ఈ ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు ఫ్యాషన్ పండితులు.
ఏకంగా విమానాశ్రయంలో క్యాట్‌వాక్ చేసిన రిహాన్నా
Related tags :