తన భార్య హసిన్ జహాన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ షమీకు తీవ్ర విభేదాలున్న విషయం తెలిసిందే. గత అర్ధరాత్రి షమీ ఇంటికి వచ్చిన జహాన్.. అక్కడ గందరగోళం సృష్టించారు. దీంతో షమీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లి, తిరిగి బెయిల్‌పై విడిచిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా మీడియాకు తెలిసింది. సహరాస్‌పూర్‌లోని అలీనగర్‌లోని తన భర్త ఇంటికి ఆమె రాగానే, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లి పోవాలని షమీ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో ఆమె తన కూతురితో కలిసి ఆమె ఓ గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు. దీంతో షమీ కుటుంబ సభ్యులు పోలీసులు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను బయటకు రప్పించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను బెయిలుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా హసిన్ మాట్లాడుతూ… ‘నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడకు రావడానికి నాకు పూర్తిగా హక్కు ఉంది. అతడి కుటుంబ సభ్యులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కూడా వారికే మద్దతు తెలుపుతున్నారు. వారిని అరెస్టు చేయకుండా నన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్నారు. కాగా, హసిన్ జహాన్ తన భర్తపై ఫిర్యాదు చేయడంతో గతంలో కోల్‌కతా పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. షమీపై నాన్ బెయిలబుల్ నేరాలతో కూడిన ఛార్జిషీట్‌ను అలీపోర్ పోలీసు కోర్టులో దాఖలు చేశారు. అతడిపై సెక్షన్ 498ఏ (వరకట్న వేధింపులు), 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసులు పెట్టారు.
షమీ ఇంట్లో గలాభా
Related tags :