మహిళలు వీటిని ధరించడంపై నిషేధం విధించిన శ్రీలంక ప్రభుత్వం. గత ఆదివారం ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంక వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బురఖా ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. బురఖా ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బురఖాలు, ముఖంను కప్పుకోవడాన్ని నిషేధిస్తున్నామన్న నిర్ణయానికి శ్రీలంక అధ్యక్షుడు ఆమోద ముద్ర వేశారు.
శ్రీలంకలో బురఖాల నిషేధం
Related tags :