జ్ఞాపకం ఏదైనా ఫొటోల్లో భద్రం చేస్తున్నాం. ఇంటర్నల్ మెమొరీలోనే కాకుండా క్లౌడ్‌లోనూ బ్యాక్‌అప్ చేస్తున్నాం. అందుకు ప్రధానమైంది గూగుల్ ఫొటోస్. ఫొటో గ్యాలరీల్లోని మీడియా ఫైల్స్‌ని ఎప్పటికప్పుడు గూగుల్ ఫొటోస్‌లోకి అప్‌లోడ్ చేస్తాం. దీంట్లో భాగంగా కొందరు ఆటోమాటిక్‌గా సింక్ అయ్యేలా చేస్తారు. దీంతో అన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అవుతాయ్. ఒకవేళ మీరు మాన్యువల్‌గా ఫొటోలను సింక్ చేస్తున్నట్లయితే కొన్ని ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయడం మర్చిపోతుంటాం. అలాంటి వాటిని గుర్తించాలంటే? గూగుల్ ఫొటోస్ కొత్త అప్‌డేట్‌ని ప్రవేశపెట్టింది. అప్‌లోడ్ చేయని ఫొటోలు, వీడియోలను సులభంగా గుర్తించొచ్చు. త్వరలోనే గూగుల్ ఫొటోస్ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
ఇక మీ ఫోటోలు మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు
Related tags :