Fashion

టాటూలు అందరికీ నప్పవు

tattoos can sometimes be ugly and might not suit you

టాటూ అనేది యువతలో లేటెస్ట్‌ ట్రెండ్‌. మనసుకు నచ్చిన చిత్రాన్ని శరీరంపై అచ్చుపోయించుకుంటారు. వివిధ కళాకృతులతో తమ తృష్ణ తీర్చుకుంటారు. అయితే ఇవి అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎంతమందికి నచ్చుతాయని అమెరికాలోని ఓ సంస్థ సర్వే చేసింది. అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయిల మనసు దోచుకోవడానికి టాటూలు వేయించుకుంటారు. అయితే దురదృష్టం ఏమిటంటే… వాటిని అమ్మాయిలు అసలు పట్టించుకోరని సర్వేలో తేలింది. ఇక అమ్మాయిలు వేళ్లు, మెడపై వేసుకొనే చిన్న టాటూలు అబ్బాయిల దృష్టిని ఆకర్శిస్తాయని తెలుసుకున్నారు. పెద్ద టాటూలు ఏవైనా అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ ఇష్టపడరని తెలిసిపోయింది. కాబట్టి కుర్రకారూ.. ఆకట్టుకోవడానికి పచ్చబొట్టులు అక్కర్లేదు… అర్థమైందా?