‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ చూసి ఉద్వేగానికి లోనయ్యానని అంటున్నారు సినీ నటి త్రిష. హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫైనల్ సిరీస్ ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ సిరీస్‌ను వీక్షించిన త్రిష సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘రమిన్ జవాదీ (మ్యూజిక్ కంపోజర్).. మీరు ఎప్పుడూ నా ఫేవరేటే. ప్రపంచంలోనే బెస్ట్ సంగీత దర్శకుడు మీరు. మీకు నేను వీరాభిమానిని. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ చివరి ఎపిసోడ్‌లో చివరి 20 నిమిషాలు మీరిచ్చిన నేపథ్య సంగీతం నన్ను ఉద్వేగానికి గురిచేసింది, భయపెట్టింది, నవ్వించింది. సాధారణంగా ఇలాంటి సిరీస్‌లు చూసి నేను ఇంతగా రియాక్ట్ అవ్వను. కానీ ఈసారి ఏడ్చేశాను’ అని పేర్కొన్నారు. ఈ సిరీస్‌కి భారత్‌లోనూ ఎందరో అభిమానులు ఉన్నారు. హాలీవుడ్‌లో బాగా పేరొందిన సిరీస్‌లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఒకటి. సీజన్ 7 వరకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన చివరి సీజన్‌లో కేవలం ఆరు ఎపిసోడ్లనే ప్రదర్శించారు.
త్రిష ఏడుపులు
Related tags :