కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చేస్తున్న ఘాటు వ్యాఖ్యలపై ఎట్టకేలకు స్పందించారు నిర్మాత మహేశ్ భట్. కంగన చిన్న పిల్లని, తనకు కూతురులాంటిదని మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాకు కంగన కూతురు లాంటిది. చిన్న పిల్ల. మాతో కలిసే తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె సోదరి నన్ను నాలుగు మాటలు అంది కదా అని నేను తనపై ఎలాంటి కామెంట్స్ చేయలేను. అలా చేస్తే నా పెంపకం, సంస్కృతి దెబ్బతింటాయి. నా పిల్లలను వేలెత్తి చూపలేను. ప్రాణం పోయినా వారి గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడను’ అని వెల్లడించారు.కంగన నటించిన ‘వో లమ్హే’ సినిమా ప్రీమియర్ షో సమయంలో మహేశ్ భట్ ఆమెపై చెప్పు విసిరి అవమానించారని కొన్ని రోజుల క్రితం రంగోలీ ఆరోపించారు. మహేశ్ భట్ కుమార్తె ఆలియాపై కూడా కామెంట్స్ చేశారు. కానీ ఆలియా ఈ విషయం గురించి స్పందించడానికి నిరాకరించారు. దాంతో ఆలియా, మహేశ్ ఏమీ మాట్లాడకుండానే పబ్లిసిటీతో బతికేస్తున్నారని రంగోలీ చురకలంటించారు.
కూతురు లాంటిది
Related tags :