టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు. తిరుమల ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలోని యాత్రికుల వసతి సముదాయం -3లో మరింత మెరుగైన ప్రమాణాలతో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని పిఏసి-3ని బుధవారం ఉదయం జెఈవో, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి పిఏసి -3 భవనం స్వచ్చంద సేవకులైన శ్రీవారి మహిళా సేవకులకు దాదాపు 5 సంవత్సరాల పాటు బసకు కేటాయించినట్లు తెలిపారు. ఇటీవల శ్రీవారి సేవకులకు కల్యాణవేదిక వెనుక వైపు నూతన శ్రీవారిసేవా సధన్‌ను ప్రారంభించిన విషయం విధితమే. ఇందులో భాగంగా పిఏసి-3లో టిటిడిలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 9 విశాలమైన హాళ్లు, సెల్లార్ ఉన్నాయన్నారు. దాదాపు 1,600 లాకర్లు, బెడ్‌షీట్లు, దిండ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఇ -2 శ్రీ రామచంద్రారెడ్డి, రిసెప్షన్-2 డెప్యూటీ ఈవో శ్రీమతి కె.పార్వతి, విజివో శ్రీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు అందుబాటులోకి పిఏసి-3
Related tags :