DailyDose

అనంతలో సోలార్ ప్రాజెక్టు-వాణిజ్య-05/01

solar project in anantapur by siemens and spring energy

Ø ప్రైవేటు రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.2,038.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.1,789.24 కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం అధికం.

Ø జెట్ ఎయిర్ వేస్కు చెందిన 100 మంది పైలట్లు సహా 500 మంది సిబ్బందిని నియమించుకున్నట్లు ప్రీమియర్ విమానయాన సేవల సంస్థ విస్తారా ప్రకటించింది

Ø యెస్‌ బ్యాంక్‌ షేర్లు కుప్పకూలాయి. మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1506 కోట్ల నష్టాన్ని ప్రకటించడం, బ్రోకరేజీ సంస్థ మెక్వారీ బ్యాంక్‌ రేటింగ్‌ను రెండు అంచెలు కిందకు సవరించడంతో బీఎస్‌ఈలో ఇంట్రాడేలో షేరు రూ.165.30 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 29.23 శాతం నష్టంతో రూ.168 వద్ద ముగిసింది.

Ø పొదుపు ఖాతా (ఎస్‌బీ అకౌంట్‌)ల్లో రూ.లక్షకు మించి ఉన్న నగదు నిల్వలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ప్రస్తుతం పొదుపు ఖాతాల్లో రూ.కోటి వరకు ఉన్న నగదు నిల్వలపై 3.5 శాతం వడ్డీరేటు, రూ.కోటికి మించితే 4 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఇకపైనా రూ.లక్ష లోపు నగదుకు 3.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.లక్షకు మించిన నగదుపై మాత్రం పావుశాతం తక్కువగా 3.25 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.

Ø గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీవీఎస్‌ మోటార్‌ రూ.133.8 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.165.6 కోట్లతో పోలిస్తే ఇది 19.2 శాతం తక్కువ.

Ø వాట్సాప్‌ ద్వారా ద్విచక్ర వాహన బీమా పాలసీలు విక్రయించనున్నట్లు భారతీ యాక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. ఇందుకోసం వెబ్‌ అగ్రిగేటర్‌ విష్‌ఫిన్‌ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది.

Ø అంబుజా సిమెంట్స్‌ 2019 మార్చి త్రైమాసికంలో రూ.695.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన రూ.514.34 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 35.2 శాతం ఎక్కువ.

Ø దివాలా స్మృతికి అనుమతిస్తూ ఎన్‌సీఎల్‌టీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌నుఆర్‌కామ్‌ ఉపసంహరించుకుంది.

Ø రక్తపోటు నివారణకు వినియోగించే బోసెంటాన్‌ జనరిక్‌ మాత్రల విక్రయానికి లుపిన్‌, నాట్కో ఫార్మాలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించింది.

Ø స్ప్రింగ్‌ ఎనర్జీ నుంచి 250 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ను సీమెన్స్‌ గమేసా అందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో అభివృద్ధి చేయనున్నారు

Ø ఏప్రిల్‌లో రూ.1,874 కోట్ల విలువైన ‘శత్రు ఆస్తులు’ను ప్రభుత్వం విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.90000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 2019-20 మొదటి నెలలో రూ.2,350 కోట్లు కూడగట్టింది.

Ø భారత్‌లో మధుమేహం ఔషధం రెమోగ్లిఫ్లోజిన్‌ను ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మా విడుదల చేసింది. రెమో, రెమోజెన్‌ బ్రాండ్‌ పేరులతో వీటిని విక్రయించనుంది.

Ø స్వీడన్‌ సంస్థ లింజేమోంటేజ్‌ ఐ గ్రాస్టార్ప్‌ ఏబీలో 85 శాతం వాటాను 24 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.167 కోట్లు)కు అనుబంధ సంస్థ కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ స్వీడన్‌ ఏబీ కొనుగోలు చేసినట్లు కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ వెల్లడించింది.

Ø స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రోపార్టీస్ గత ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 156.66 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 370 శాతం అధికం