DailyDose

తీగ కదిలింది. అక్రమ సంతానానికి ఆస్తి రాస్తాడేమోనని….

reasons behind rohit tiwaris murder by apurva shukla

రోహిత్‌ శేఖర్‌ తివారీ హత్యకేసులో అరెస్టయిన అతని భార్య అపూర్వ శుక్లా పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపెట్టారు. తన భర్తకు పెళ్లిముందే ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుకునే ఆయన ఆస్తికి వారసుడిని చేయాలని భావించారని, అందుకే రోహిత్‌ను చంపేసినట్టు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించారు. రెండురోజుల పోలీసు రిమాండ్‌లో ఉన్న ఆమె తన వైవాహిక జీవితం, రోహిత్‌తో ఎదురైన సమస్యలు.. హత్యకు దారితీసిన పరిస్థితులు క్షుణ్నంగా పూస గుచ్చినట్టు వివరించారు. రోహిత్‌కు పెళ్లి ముందునుంచే వివాహేతర సంబంధం ఉండటం తనను తీవ్రంగా దహించివేసిందని, అతనికి ఓ దూరపు చుట్టమైన మహిళతో అత్యంత సాన్నిహిత్యం ఉందని ఆమె పోలీసులకు తెలిపారు. ‘ఆ మహిళ తన కొడుకు రోహిత్‌ ఆస్తిలో వాటా ఇవ్వాలని తరచూ కోరేది. మీ ఇంటి కొడుకే కదా అని తరచూ అంటుండేది. రోహిత్‌ కూడా ఆ పిల్లాడిపై ప్రేమ, ఆప్యాయతలు ఉండటం నా అనుమానాలను పెంచింది’ అని ఆమె తెలిపింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అపూర్వ తాను తరచూ ఇండోర్‌, ఢిల్లీ మధ్య పర్యటించేదానినని, ఇండోర్‌ జిల్లా కోర్టుతోపాటు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్‌ చేస్తుండటంతో అనంతరం ఢిల్లీకి మారానని ఆమె తెలిపారు.