Food

క్రీం దోసకాయ తిన్నారా ఎప్పుడైనా?

dosakaya cream curry in telugu easy short fast recipe

*** కావల్సినవి:
దోసకాయ – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి, క్రీం – పావుకప్పు, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కారం – చెంచా, ఎండుమిర్చి – రెండు, తాలింపు గింజలు – చెంచా, నూనె – రెండు చెంచాలు.

*** తయారీ:
బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు, ఎండుమిర్చిని వేయించాలి. ఆ తరవాత ఉల్లిపాయముక్కలు వేయించి.. దోసకాయ ముక్కలు చేర్చి, పసుపు వేసి మూత పెట్టేయాలి. దోసకాయ మెత్తగా అయ్యాక ఉప్పు, కారం కలపాలి. రెండు నిమిషాలయ్యాక క్రీం కూడా కలిపి దింపేస్తే సరిపోతుంది. ఆ వేడికి క్రీం కూరలో కలుస్తుంది.