వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది జ్యోతిక. ఇటీవల ‘నాచ్చియార్’తో పోలీసు అధికారిణిగా అలరించిన ఆమె మరోమారు అదే తరహా పాత్రలో నటించింది. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జాక్‌పాట్’ అని పేరు పెట్టారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ సహ నిర్మాత. ఇందులో రేవతి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను తాజాగా ఆవిష్కరించారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ రీ ఎంట్రీ తర్వాత ఇది వరకు జ్యోతిక నటించిన చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. హాస్య ప్రధానంగా ఈ సినిమాను రూపొందించాం. రేవతి కూడా పోలీసు పాత్రలో కనిపిస్తారు. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. రెండు గంటలపాటు సరదాగా నవ్వుకోవచ్ఛు జ్యోతిక హిట్ల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుంది. వినోదంతోపాటు తప్పకుండా ఓ సందేశం కూడా ఉందని’’ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌కుమార్ సినిమాటోగ్రాఫర్ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
“జాక్‌పాట్” కొడతారా?
Related tags :