వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలిచే వర్మ చేసిన తాజా ట్వీట్‌ని బట్టి చూస్తుంటే ఆయన మోదీని టార్గెట్ చేసాడా అనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లర్, భారత ప్రధాని మోదీ ఫోటోలని జత చేసి సేమ్ టూ సేమ్ అనే కామెంట్ పెట్టాడు. ఇందులో ఇద్దరు చిన్నారుల చెవులు పట్టుకొని ఉండడం విశేషం. అయితే ఈ ఫోటోతో వర్మ ఏం చెప్పదలచుకున్నాడు అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వర్మ ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ చేసేందుకు కుస్తీలు పడుతున్నాడు. మే 1న చిత్రం విడుదల కానుందని అఫీషియల్‌గా ప్రకటించిన, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. పోలింగ్ పూర్తైన తర్వాత సినిమాని విడుదల చేసుకోవచ్చనే ఉత్తర్వులు వచ్చినప్పటికి, సినిమా విడుదలకి కొందరు అడ్డుపడుతున్నారని వర్మ ఇన్‌డైరెక్ట్‌గా చంద్రబాబుని దూషిస్తూ వస్తున్నాడు.
మోడీ-హిట్లర్ సేం టు సేం
Related tags :