Ø బంగారానికి మళ్లీ గిరాకీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయంగా 159 టన్నుల పసిడికి గిరాకీ లభించిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. 2018 ఇదే త్రైమాసికం నాటి 151.5 టన్నులతో పోలిస్తే, ఇది 5 శాతం అధికం. ధరలు తగ్గడం, వివాహాది శుభకార్యాల వల్ల ఆభరణాల విక్రయాలు పెరగడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
Ø దేశంలో మొదటి సారిగా డిజిటల్ కేంపస్‌ను ఏర్పాటు చేసే సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), టెక్నాలజీ దిగ్గజమైన సిస్కోతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
Ø అన్ని రంగాల పరిశ్రమల్లో సాంకేతికత వినియోగం పెరుగుతున్నందున, 2019లోనూ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లోనే అధిక ఉద్యోగాలు లభిస్తాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ షైన్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది.
Ø అధిక ఆదాయాన్ని ఇచ్చే చందాదార్లను ఆకట్టుకునేందుకు ఎయిర్టెల్ థ్యాంక్స్ పథకాన్ని భారతీ ఎయిర్టెల్ పునఃప్రారంభించింది. మై ఎయిర్టెల్ పేరిట ఉన్న యాప్‌ను ఎయిర్టెల్ థ్యాంక్స్గా మార్చి, దాని ద్వారానే ఈ సేవలు అందిస్తోంది. సిల్వర్, గోల్డ్, ప్లాటినం చందాదార్లకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, వింక్మ్యూజిక్లలో ప్రీమియం కంటెంట్ లభిస్తుంది. ఇ-బుక్‌లు, మొబైల్ భద్రతకు తోడు ఆఫర్ విక్రయాలు, వివిధ కార్యక్రమాలకు ముందస్తు ఆహ్వానం వంటివీ లభిస్తాయి. చందాదారు ఆసక్తి, వినియోగాన్ని బట్టి ఆయా సేవలు అందిస్తామని భారతీ ఎయిర్టెల్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ ఆదర్స్ నాయర్ తెలిపారు.
Ø సెన్సెక్స్ ఉదయం 39,036.51 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 38,882.99 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం లాభాల్లోకి వచ్చినప్పటికీ.. తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 39,189.95 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 50.12 పాయింట్ల నష్టంతో 38,981.43 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 23.40 పాయింట్లు తగ్గి 11,724.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,699.55- 11,789.30 మధ్య కదలాడింది.
Ø ప్రైవేటు రంగ బంధన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.650.87 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.387.86 కోట్లతో పోలిస్తే ఇది 68 శాతం ఎక్కువ.
Ø లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.635.2 కోట్ల ఆదాయాన్ని, రూ.43.2 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
Ø కాగితం తయారీ కంపెనీ అయిన ఇంటర్నేషనల్ పేపర్ ఏపీపీఎం లిమిటెడ్ (గతంలో ఆంధ్రప్రదేశ్ పేపర్‌మిల్స్ లిమిటెడ్) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.378.21 కోట్ల మొత్తం ఆదాయం, రూ.59.90 కోట్ల నికరలాభం, రూ.15.06 ఈపీఎస్ నమోదు చేసింది.
Ø సిగ్నిటీ టెక్నాలజీస్ 2018-19 నాలుగో త్రైమాసికంలో రూ.29.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాదిలో ఇది రూ.19.8 కోట్లుగా ఉంది.
Ø ఐటీ సేవల సంస్థ తాన్లా సొల్యూషన్స్ 2018-19 చివరి త్రైమాసికంలో రూ.321.78 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం రూ.9.73 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.211.94 కోట్లు, నికర నష్టం రూ.5.21 కోట్లు ఉంది.
Ø మోసపూరిత ఫోన్లు, సందేశాలను నియంత్రించేందుకు ఉపయోగపడే బ్లాక్ చైన్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు టెక్ మహీంద్రా తెలిపింది. దీని ద్వారా 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
Ø రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కు ఐటీ సంస్థ విప్రో వాటాదార్ల అనుమతి కోరింది. బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా అరుంధతీ భట్టాచార్య నియామకానికి సైతం అనుమతి కోరింది.
Ø సన్‌ఫార్మాకు చెందిన దాద్రా ప్లాంటులో 2019 మార్చి 22-29 మధ్య జరిపిన తనిఖీల్లో 11 లోపాలను యూఎస్ఎఫ్డీఏ కనుగొంది. కంపెనీకి ఫారం 483ని కూడా జారీ చేసింది. అయితే లోపాలను కనుగొన్నప్పటికీ, నియంత్రణ పరమైన చర్చలు చేపట్టడానికి, సూచనలు చేయడానికి సిద్ధంగా లేమంటూ వాలెంటరీ యాక్షన్ ఇండికేటడ్ క్లాషిఫికేషన్ను యూఎస్ఎఫ్డీఏ ఇచ్చింది.
Ø ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కు చెందిన మెటలర్జికల్ అండ్ మెటాలిక్ హ్యండ్లింగ్ వ్యాపార విభాగానికి పసిడి ప్రాసెసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టు లభించింది
Ø ఓలోపాటడైన్ హైడ్రోక్లోరైడ్ ఆప్తాల్మిక్ సొల్యూషన్ ఏఎన్‌డీఏ (అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించాయని అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్వెల్లడించింది.