ఒకప్పుడు లవర్‌బాయ్‌గా తన సినిమాలతో అలరించిన నటుడు సిద్ధార్థ్. ఆయన నేరుగా తెలుగు సినిమాల్లో నటించి చాలా ఏళ్లవుతోంది. ఎక్కువగా తమిళ చిత్రాలతోనే బిజీగా ఉంటున్నారు. అయితే తాను మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడతానని అంటున్నారు సిద్ధార్థ్. ఇటీవల ఆయన నటుడు సునీల్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘జీవితాంతం నా బెస్ట్ ఫ్రెండ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. సునీల్‌తో కలిసి ‘బొమ్మరిల్లు’ సినిమాలో నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ‘మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పుడొస్తారు? తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ అభిమానుల కోసం ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఎవడేమన్నా నేను మళ్లీ తిరిగొస్తాను. నేను చేస్తున్న ఈ ప్రామిస్‌ను గుర్తుపెట్టుకోండి. మరోసారి నా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు 18 నెలలు సమయం ఇవ్వండి ప్రేక్షకులారా. నాపై మీకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. కష్టపడతాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేతిలో ఉన్నాయి. మాట్లాడుకుందాం’ అని పోస్ట్ చేశారు. 2003లో ‘బాయ్స్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సిద్ధార్థ్. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘బొమ్మరిల్లు’, ‘ఓయ్’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన చివరి సారిగా తెలుగులో నటించిన చిత్రం ‘బాద్‌షా’. ఇందులో ఆయన ఎన్టీఆర్ సోదరుడి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఒక హిందీ సినిమాతో పాటు రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
నేను తిరిగి వస్తాను
Related tags :