పాకిస్థాన్‌లో ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల 90 మందికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. వీరిలో 65 మంది చిన్నారులు ఉన్నారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలను వాడటం వల్లే వీరందరికీ ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల లర్కానా నగర సమీప ప్రాంతాల్లో 18 మంది చిన్నారుల్లో ఎయిడ్స్ వ్యాధిని గుర్తించిన అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించగా మరో 72 మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు వెల్లడైంది. స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్ద వీరంతా చికిత్స తీసుకున్న సమయంలో అతడు కలుషిత సిరంజీలను వాడాడని, దీంతో మొత్తం 90 మందికి ప్రమాదకర ఎయిడ్స్ వ్యాధి సోకిందని పోలీసులు చెప్పారు. సదురు వైద్యుడికి కూడా ఈ రోగం ఉన్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ వైద్యుడి నిర్వాకం!
Related tags :