*** కావలసినవి
రొయ్యలు: అరకిలో, పసుపు: 2 టీస్పూన్లు, కారం: అరటీస్పూను, ఉప్పు: టీస్పూను గ్రేవీ కోసం: మామిడికాయ: ఒకటి, పచ్చికొబ్బరి: కప్పు, చింతపండు: చిన్న నిమ్మకాయంత, పసుపు: టీస్పూను, ఎండుమిర్చి: మూడు, మిరియాలపొడి: రుచికి సరిపడా, దనియాలు: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, నూనె: టీస్పూను
*** తయారుచేసే విధానం
* రొయ్యల్ని శుభ్రంగా కడిగి పసుపు, కారం, ఉప్పు పట్టించి సుమారు అరగంటసేపు అలాగే ఉంచాలి.
* పచ్చి మామిడికాయ పొట్టు తీసి ముక్కలుగా కోయాలి.
* పచ్చికొబ్బరి, పసుపు, చింతపండు, మిరియాలు, దనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసి మెత్తగా రుబ్బాలి.
* ఓ మందపాటి గిన్నెలో రొయ్యలు, మామిడికాయ ముక్కలు వేసి సుమారు అరకప్పు నీళ్లు పోసి, రుబ్బిన గ్రేవీ మిశ్రమం రెండు టేబుల్‌స్పూన్లు వేసి పది నిమిషాలు ఉడికించాలి. తరవాత మిగిలిన గ్రేవీ వేసి తగినన్ని నీళ్లు పోసి మీడియం మంట మీద మరో పది నిమిషాలు ఉడికించాలి.
* ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేగాక అందులో కూర వేసి కలిపితే సరి.