ఉత్తరకొరియా పాలకుడు కిమ్ దూకుడు పెంచాడు. అమెరికాతో హనోయ్‌లో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత కిమ్ వైఖరిలో మార్పునకు తాజా చర్యలు చిహ్నంగా నిలిచాయి. తాజాగా ఉత్తరకొరియా కొన్ని స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగం శనివారం ఉదయం 9.06కు హోడో ద్వీపకల్పం సమీపంలో వోన్‌సోన్‌పట్టణం వద్ద జరిగింది. ఈ క్షిపణులు 70 కిమీ నుంచి 200 కిమీ మధ్య దూరం ప్రయాణించాయి. ఈ విషయాన్ని దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఈ పరిణామాలను దక్షిణ కొరియా జాగ్రత్తగా గమనిస్తోంది. 2017 నవంబర్‌లో చివరి సారి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చర్చలు విఫలమైనప్పుడే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వారం మొదట్లో ఉత్తరకొరియా మంత్రి చోస్ సన్ హుయ్ మాట్లాడుతూ అమెరికా ఆర్థిక ఆంక్షలను తొలగించకపోతే అనుకోని పరిణామాలు చోటు చేసుకొంటాయని హెచ్చరించారు. ఈ పరీక్షల విషయంలో ఉత్తరకొరియా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కిమ్ జోంగ్ ఉన్ గతంలో ఖండాంతర క్షిపణుల ప్రయోగంపై స్వీయ నియంత్రణ విధించుకొన్నారు. అందుకే ఈ సారి స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించారు.
ట్రంప్‌కు కృతజ్ఞతలతో ఈ క్షిపణి అంకితం
Related tags :