7 కిలోల స్వర్ణ కిరీటాన్ని ధరించిన థాయ్‌ల్యాండ్ రాజు.
థాయ్‌ల్యాండ్: థాయ్‌ల్యాండ్ రాజు వజిరాలాంగ్‌కార్న్‌కు ఇవాళ పట్టాభిషేక మహోత్సవం జరిగింది.
మూడు రోజలు పాటు జరిగే ప్రక్రియ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
తొమ్మిది అంచెల ఛత్రీ కింద రాజును కూర్చోబెట్టి.. ఆయన శిరస్సుపై భారీ బంగారు కిరీటాన్ని ధరించారు.
ఆ కిరీటం సుమారు 7.3 కిలోల బరువు వుంది. ఇది క్వీన్ ఎలిజబెత్ కిరీటం కన్నా ఏడు రేట్లు బరువైనదట.
ఇవాళ ఉదయం బౌద్ధ, బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం రాజు వజిరాలాంగ్‌కార్న్ పట్టాభిషేకం మొదలైంది.
బంగారం, వజ్రాలతో తయారైన పాదరక్షకాలను ఆయనకు తొడిగారు.
అంతకముందు బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం పవిత్ర జలంతో రాజుకు మంగళ స్నానం చేయించారు.
బ్యాంకాక్ వీధులన్నీ వేడుకను వీక్షించేందుకు జనంతో నిండిపోయాయి.
మూడు రోజుల క్రితమే తన అంగరక్షకురాలు సుదితను రాజు పెళ్లాడిన విషయం తెలిసిందే.