Fashion

గళ్ల చొక్కాలకు మాంచి క్రేజ్

new trend in mens fashion is to go back to big checkered shirts

1990ల నాటి ఫ్యాషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోందా? అవుననే అంటోంది ఫ్యాషన్‌ ప్రపంచం. పెద్దపెద్ద చారలు, గళ్ల షర్ట్‌లకు 1990 నుంచి 95 మధ్య కాలంలో మంచి క్రేజ్‌ ఉండేది. తర్వాత అవి మరుగున పడిపోయాయి. ప్లెయిన్‌ షర్ట్స్‌ మీద యువతకు ఆసక్తి పెరిగిపోవడంతో… గీతల చొక్కాలు ఉన్నా అంతగా ఆదరణ పొందేవి కావు. ఇప్పుడు ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, పూజాహెగ్డె… లైన్స్‌, చెక్స్‌ డిజైన్లలో కన్పించి అలరిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రంగులు, నాణ్యమైన వస్త్రం వీటిని మేటిగా నిలుపుతున్నాయి. ఈ షర్ట్స్‌ని అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఇష్టపడుతుండటంతో క్రేజ్‌ మరింత పెరిగింది. లైన్స్‌, చెక్స్‌ మోడల్స్‌లోనే అమ్మాయిలకు స్కర్ట్‌లు, సల్వార్లు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు డిజైనర్లు. జాకెట్లు, సూట్లలోనూ ఇదే ట్రెండ్‌ ఫాలోఅవుతున్నారు.