విదేశీ పౌరసత్వాల కోసం కొందరు హీరోలు ఎగబడుతున్న విషయం తెలిసిందే. నటుడు అక్షయ్‌కుమార్ కూడా కెనడా పౌరసత్వానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం కెనడా పౌరసత్వాన్ని ఇస్తానని ముందుకొచ్చినా.. ఎలాంటి అరమరికలు లేకుండా వద్దని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ‘సంగీత తుపాను’ ఏఆర్ రెహమాన్. ఆ విషయాన్ని ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే.. రెండేళ్ల క్రితం కెనడా మేయరు రెహమాన్… ఏఆర్ రెహమాన్‌కు చట్టబద్ధంగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే అందుకు ఏఆర్ రెహమాన్ ఏ మాత్రం ఒప్పుకోలేదు. దీనిపై ఆస్కార్ విజేత స్పందిస్తూ.. ‘కెనడా మేయరు నాకు పౌరసత్వాన్ని ఇవ్వాలనుకున్నందుకు కృతజ్ఞతలు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. కానీ తమిళనాడులో చాలా సంతోషంగా ఉన్నా. భారతదేశమే నా కుటుంబం. స్నేహితులు, నా ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీరు ఇండియాకు వచ్చేటప్పుడు తప్పకుండా నా సం గీత కళాశాలకు ఒక సారి విచ్చేయండి. ఇండియా, కెనడా సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా’నని పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్ స్పందన ఆయన దేశభక్తికి అద్దం పడుతోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కెనడా పౌరసత్వం వద్దని చెప్పినా కానీ.. అక్కడి ఒండోరియాలో ఏఆర్ రెహమాన్ పేరిట ఓ వీధి ఉండటం విశేషం. అక్కడ ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు.
నాకొద్దు మీ పౌరసత్వం
Related tags :