Sports

వచ్చే ఏడాది బాగా ఆడతాం

Ashwin On Kingx XI Punjab Leaving IPL Early In 2019

కింగ్స్‌ XI పంజాబ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ లీగ్‌ దశను విజయంతో ముగించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ రన్‌రేట్‌ (-0.251)తక్కువగా ఉండటంతో ఆ జట్టు పాయింట్ల పట్టిక ఆరోస్థానానికి పరిమితమైంది. ఆదివారం మొహాలీ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరువికెట్ల తేడాతో గెలుపొందింది. దీనిపై జట్టు సారథి రవిచంద్రన్ అశ్విన్‌ మాట్లాడాడు. ‘సీజన్‌ను ఇలా ముగించినందుకు బాధగా ఉంది. నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. మేం విజయవంతంగా నడిపిస్తుంటే ఫ్రాంచైజీలకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి మేమింకా అత్యంత నాణ్యంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదో ప్రత్యేకంగా చేయాలి. మరి కొంత మంది నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు అవసరం. చివరి మ్యాచ్‌ను ఘనంగా ముగించినందుకు ఆనందంగా ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోనందుకు బాధగానూ ఉంది. వచ్చే ఏడాది మరింత వినోదాన్ని అభిమానులకు పంచడానికి ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు. మొహాలి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(71; 36 బంతుల్లో 7×4, 5×6) అర్ధశతకంతో రాణించడంతో ధోనీ సేన 171 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 2 ఓవర్లు మిగులుండగానే ఛేదించింది.