నేటి తొలి క్వాలిఫయర్‌లో ముంబైతో చెన్నై ఢీ. గెలిచిన జట్టు తుదిపోరుకు. ఓడిన టీమ్‌కు మరో చాన్స్. నెలన్నర రోజులుగా ఆసక్తికరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-12వ సీజన్‌లో ఇక అసలు సిసలు సమరం ప్రారంభం. ఆదివారంతో లీగ్ మ్యాచ్‌లు ముగియగా మంగళవారం కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముందుగా తొలి క్వాలిఫయర్‌లో పటిష్ఠ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే సీఎస్‌కేపై రెండుసార్లు నెగ్గిన ముంబై మళ్లీ ఆధిపత్యాన్ని కనబరుస్తూ నేరుగా ఫైనల్‌కు వెళ్తుందా.. లేక ధోనీ సేనే రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటూ ముందుగా బెర్త్ దక్కించుకుంటుందా అనేది వేచిచూడాల్సిందే..
చెన్నై: వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, ధోనీ (కెప్టెన్), మురళీ విజయ్/ధ్రువ్ షోరే, బ్రావో, జడేజా, దీపక్ చాహర్, హర్భజన్, తాహిర్.
ముంబై: రోహిత్ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్, హార్దిక్, క్రునాల్, అనుకుల్ రాయ్, రాహుల్ చాహర్, మలింగ, బుమ్రా.
పిచ్..చెపాక్ మైదానం ఎప్పటిలాగే బౌలింగ్‌కు అనుకూలించవచ్చు. ఈసీజన్‌లో ఇక్కడ తక్కువ స్కోర్లే నమోదయ్యా యి. స్పిన్నర్లదే ప్రధాన పాత్ర కానుంది.చెపాక్ మైదానంలో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరగ్గా, ముంబై 5సార్లు, చెన్నై 2 సార్లు నెగ్గాయి.రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..