Food

అరటికాయ-క్యారెట్ కలిపి కొడితే…

banana carrot garelu in telugu short recipe easy and fast

*** కావలసినవి:
తొక్కతో కలిపి ఉడికించిన కూర అరటికాయ – ఒకటి, బియ్యప్పిండి – కప్పు, క్యారెట్‌ తురుము – కప్పు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – పది, పచ్చిమిర్చి – ఐదు, కొత్తిమీర తురుము: అరకప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – చెంచా, నూనె – వేయించడానికి సరిపడా.

*** తయారుచేసే విధానం:
* ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి.

* తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యప్పిండి వేసుకుని కలుపుకోవాలి.

* ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి.

* ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్‌ గారెలు సిద్ధం.