తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట విద్యుత్ ఉపకేంద్రం లో పని చేస్తున్న సబ్ ఇంజనీర్ కె.శివచంద్ర శంకర్ ను రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్రావు వలపన్ని పట్టుకున్నారు.బోరు మోటార్ కనెక్షన్ ఇవ్వడానికి వానపల్లి కి చెందిన రైతు ఎడ్లపల్లి భగవాన్ ను సబ్ ఇంజనీర్ శంకర్ 15000/- రూ లంచం డిమాండ్ చేశారు. రైతు రాజమండ్రి ఏసీబీ ను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు కొత్తపేట విద్యుత్ ఉప కేంద్రానికి చేరుకొని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు రాజమండ్రి ఏసీబీ కోర్ట్ లో హాజరుపరచనునట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపారు.
రైతుకు కడుపు మండింది. ప్రభుత్వ ఉద్యోగికి బేడీలు పడింది.
Related tags :