న్యూజెర్సీ సాయిదత్తపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఏక్ మే అనేక్”” రూపకానికి అద్భుత స్పందన లభించింది. న్యూజెర్సీ ప్లయిన్ పీల్డ్ లో సాయి సమర్పణ్ బృందం, న్యూయార్క్ వారు నిర్వహించిన ఈ ప్రదర్శనకు భక్తజనం భారీగా తరలివచ్చారు. తెలుగువారితో పాటు భారతీయులు చాలామంది ఈ ప్రదర్శనను తిలకించేందుకు పోటీ పడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం…ఇదే సాయితత్వం. దీనిని మనసులకు కట్టిపడేసే విధంగా సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించిన తీరుకు ప్రశంసల వర్షం కురిసింది. సాయి తత్వాన్ని భావోద్వేగాల మధ్య.. చక్కటి నేపథ్య సంగీతంతో సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించింది. హేమాడ్ పంత్ దాభోల్కర్ రాసిన ఈ నృత్యరూపకం సాయి భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఆ దైవమే మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొలిపేందుకు.. మంచితనాన్ని పెంచుకునేందుకు మానవరూపం లో మన మధ్యకు వచ్చాడు అనేది ఈ ఏక్ మే అనేక్ రూపకం చక్కగా చూపెట్టింది. సాయిని కొలవడమంటే ఏమిటి..? సాటి వ్యక్తిని ప్రేమించడమే…ప్రేమతత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయడం చేయడమే. నేను అనే అహాన్ని విడనాడి మనమనే మమకారాన్ని పెంచుకుని అడుగులు వేస్తే అదే సాయి మార్గమవుతుంది.. ఆ సాయినాథుడి దీవెన మనకు అందుతుంది అనే సందేశాన్ని ఈ రూపకం ద్వారా అందించారు. సాయి దత్త పీఠం నిర్వహకులు రఘు శర్మ శంకరమంచి మంచి ప్రణాళికతో వ్యవహరించడంతో ఆధ్యాత్మిక ప్రదర్శన అయినప్పటికి చాలా మంది ఈ ప్రదర్శనకు విచ్చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఏక్ మే అనేక్ రూపకాన్ని ప్రదర్శించినందుకు సాయి సమర్పణ్ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సాయితత్వాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా రఘుశర్మ శంకరమంచి అన్నారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన సాయి దత్త పీఠం సేవా బృందాలను రఘు శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో సాయిదత్త పీఠం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందున్నారు. రఘుశర్మ శంకరమంచి మీడియాతో మాట్లాడుతూ…””సాయి సమర్పణ, న్యూయార్క్ బృందంలోని ప్రతీ సాయి భక్తునికీ సునమస్సులు.మీ అందరి చక్కటి ప్రదర్శన ఈ ఏక్ మే అనేక్ అనే భక్తి, నృత్య ప్రదర్శన చూడటానికి రెండు కళ్ళు చాలవు.సంకల్పం గొప్పదైతే.. దానిని సాధించే వారిలోచిత్తశుద్ధి ఉంటే.. కచ్చితంగా అది విజయవంతం అవుతుందనే దానికి ఈ *ఏక్ మే అనేక్* రూపకం ఓ నిలువెత్తు నిదర్శనం. ఆ సాయినాధుడే మనందరిని నడిపించాడు. మనం తలపెట్టిన కార్యాన్ని దిగ్విజయం చేయడానికి దీవెనలు అందించాడు. ఆ సాయిని నిండు మనసుతో కొలిచేవారు అదే నిండు మనసుతో మన ఈ ఏక్ మే అనేక్ విజయానికి కృషి చేశారు. ఇంతటి బృహత్కార్యానికి నడుం బిగించి నన్ను వెన్నంటే ఉన్న నా స్టాఫ్, బోర్డు సభ్యులు, వాలంటీర్లు, SDP ఫామిలీ, ముఖ్యం గా దాతలు, భక్తుల సేవా ధృక్పధం అనిర్వచనీయం. మీ అందరి సహాయ సహకారాలు లేకుండా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించటం అసాధ్యం. సుసాధ్యం చేసినా ప్రతీ ఒక్క రికీ కృతజ్ఞతాభివందనములు. డిట్రాయిట్ నుండి విచ్చేసిన ప్రత్యేక అతిధి, SSST ట్రస్టీ శ్రీ. నాగేశ్వర రఘుపాత్రుని గారికీ, మా మిత్రులుసాయి దత్త పీఠం డైరెక్టర్లైన అశోక్ బడ్డి, చికాగోనుండి విచ్చేసిన రాజ్ పొట్లూరి కి ప్రత్యేక ధన్యవాదములు. స్థానికంగా ఉన్న అన్ని తెలుగు సంస్థలు, ఆర్గనైజేషన్స్ నుండి విచ్చేసిన పెద్దలు, న్యూ యార్క్, కనెక్టికట్, పెన్సిల్వేనియా ల నుండి కూడా సాయి బాబా భక్తులు విచ్చేసి ఈ ఏక్ మే అనేక్ చూసి ఆనందించారు. ఈ ఈవెంట్ సక్సెస్ విషయం లో మా వెన్నంటేఉండి ప్రతీ విషయంలో సలహాలు సూచనలుఇస్తూ..మా అందరినీ నడిపించిన ఉపేంద్ర చివుకులకి ప్రత్యేక ధన్యవాదములు.”” రఘుశర్మ, సాయి సమర్పణ్ కళాకారులను, దాతలను దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర, సాయి సమర్పణ్ టీంకు పబ్లిక్ యుటిలిటీస్-న్యూజెర్సీ నుండి ప్రశంసా జ్ఞాపికను అందచేశారు.
న్యూజెర్సీలో షిర్డీ సాయిపై “ఏక్ మే అనేక్” రూపకం
Related tags :