Politics

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంలో చంద్రబాబుకు చుక్కెదురు

Supreme Court of India Dismisses vvpat slips counting petition by oppostion

50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న 21 విపక్ష పార్టీల రివ్యూ పిటిషన్‌ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పు అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘ మేం వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే మా కోరిక. వీవీ ప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం లాభం. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిందేనని గట్టిగా కోరాం. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది మా ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యమని ఈసీ గుర్తించాలి. పారదర్శకత వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యంలో అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే మా పోరాటం కొనసాగిస్తాం. వీవీ ప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తాం. మా పోరాటం వల్ల ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడంలో ఈసీకి అభ్యంతరమేంటి? సిబ్బంది సరిపోరని చెప్పడం తప్పించుకోవడమే. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి సిబ్బంది సరిపోతారు’’ అని చంద్రబాబు వివరించారు.