స్టైల్‌గా, చక్కని ఆకృతిలో కనిపించేలా చేయడంలో బెల్ట్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అంటే…లెదర్‌ది మాత్రమే కాదు… ఇప్పుడు అమ్మాయిల ఆహార్యానికి తగ్గట్లు ఎన్నో వచ్చేశాయి. ఫ్యాబ్రిక్, లేస్, మెటల్…ఇలా పలు రకాల్లో ఆకట్టుకుంటున్నాయి. చీర నుంచి జీన్స్ వరకూ ప్రతిదానిపైనా ఎంచుకునే ఫ్రెండ్లీ యాక్సెసరీ ఇది.
* ఇప్పుడు ఓవర్‌సైజ్డ్ ఫ్యాషన్ సందడి చేస్తోంది. వేసుకోవాలని ఉన్నా… అంతగా నప్పదేమో అని భయపడక్కర్లేదు. నడుముకి ఓ సన్నటి బెల్ట్ జత చేయండి. అలానే లాంగ్‌కోట్ వేసుకున్నప్పుడు కూడా బెల్ట్ బాగుంటుంది.
* కాస్త మందంగా ఉన్న టాప్‌లు వేసుకున్నప్పుడు శరీరాకృతి సరిగ్గా కనిపించదు. అలాంటప్పుడు ఓ స్కిన్నీ బెల్ట్ పెట్టుకుంటే చాలు. పాలిపోయినట్లు ఉన్న రంగుల దుస్తుల్ని ఎంచుకున్నప్పుడు కూడా కాంతిమంతమైన రంగులో ఓ లెదర్ బెల్ట్ ఎంచుకోవచ్చు.
* నలుపు, ఎరుపు, గోధుమ రంగు పార్టీవేర్ డ్రెస్‌కి జతగా గోల్డ్, కాపర్ మెటాలిక్ బెల్ట్‌ని ఎంచుకుంటే ప్రత్యేక ఆకర్షణ మీరే అవుతారు. ప్రయత్నించి చూడండి.
* ఆఫీసుల్లో చిన్న చిన్న గెట్ టు గెదర్‌లు ఉన్నప్పుడు జీన్స్, స్కర్ట్ వంటివి ఫార్మల్ లుక్ కోసం వేసుకున్నా… జాకెట్‌పై బెల్ట్ పెట్టుకుంటే పార్టీలుక్ వచ్చేసినట్లే.
* ఈ కాలంలో ప్రింట్లు, ప్యాటర్న్‌లు ఎక్కువగా ఉపయోగిస్తాం. కాస్త వదులుగా ఉండే అలాంటి దుస్తుల్లో మన శరీరాకృతి చక్కగా కనిపించాలంటే… లేస్‌బెల్ట్, లేదా ఓ వస్త్రంతో చేసిన రకాన్ని ఎంచుకుని చూడండి.
* లాంగ్ గౌన్‌లు పొడవుగా ఉన్నవారిని మరింత పొడవు కనిపించేలా చేస్తాయి. లావుగా ఉన్నవారిని ఇంకాస్త లావుగా కనిపించేలా చేస్తాయి. ఇలాంటప్పుడు సన్నటి స్లీక్ బెల్ట్ ఒకదాన్ని జత చేసుకుంటే చాలు.
మహిళల నడుముకు ముద్దులొలికే సింగారం
Related tags :