నష్టాల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ముందుకొచ్చారు. తన సొంత నిధుల నుంచి రూ.250 కోట్లను సంస్థకు బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థకు యజమానిగా వ్యవహరిస్తున్న బ్యాంకుల కన్సార్షియానికి ఆ నిధులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సంస్థ ఛైర్మన్ పదవి నుంచి నరేశ్ గోయల్ వైదొలిగిన విషయం తెలిసిందే. సంస్థలో ఆయనకు ఉన్న మెజారిటీ షేర్లు వదులుకోవడానికీ సిద్ధమయ్యారు. ఆయన దిగిపోయిన తర్వాత సంస్థను కాపాడేందుకు అవసరమైన నిధులను సమకూర్చడంలో వాటాదారులంతా విఫలమయ్యారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలకూ నిధులు అందుబాటులో లేవు. అలా సంస్థ సేవలు ఏప్రిల్ 17తో నిలిచిపోయాయి. అప్పటికి సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 సిబ్బంది భవితవ్యం అంధకారంలో పడిపోయింది.
₹250కోట్లు సొంత నిధుల విడుదల
Related tags :