నలభైల తర్వాతో, యాభైల తర్వాతో… ఆరోగ్య ప్రయోజనాల కోసం వ్యాయామాలు చేయడం మొదలుపెడతాం. ఆ వయసు వారితో పోలిస్తే.. యువతరానికి ముఖ్యంగా ఆడపిల్లలకు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయట. ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత కాసేపు వ్యాయామం చేస్తే అది మెదడులో నిక్షిప్తం అవ్వడానికి ఆస్కారం ఎక్కువని ‘కాగ్నిటివ్ రీసెర్చ్: ప్రిన్సిపల్స్ అండ్ ఇంప్లికేషన్’ అనే ఆరోగ్య పత్రిక తాజాగా రాసిన వ్యాసంలో వివరించింది. ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఐదునిమిషాల పాటూ ఏరోబిక్స్ కానీ స్టెప్ తరహా వ్యాయామాలుకానీ చేసిన వారితో.. వ్యాయామాలు చేయని వారిని పోల్చిచూసింది. వ్యాయామాలు చేసిన వారిలో మెరుగైన ఫలితాలని గమనించింది. అందులోనూ అబ్బాయిల్లోకంటే అమ్మాయిల్లో సానుకూల ఫలితాలు ఎక్కువగా కనిపించాయని ఈ అధ్యయనం చేసిన న్యూసౌత్‌వేల్స్ అధ్యాపకుడు స్టీవెన్‌మోస్ట్ వివరించారు.
కొత్త విషయం నేర్చుకున్నాక వ్యాయామం చేయండి
Related tags :