బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి, మేనేజర్ రంగోలీ.. హృతిక్ రోషన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హృతిక్ నటిస్తు్న్న ‘సూపర్ 30’ సినిమా, కంగన నటిస్తున్న ‘మెంటల్ హై క్యా’ సినిమా ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. అయితే.. కంగనకు హృతిక్‌కు మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో అనవసరమైన గొడవలు ఎందుకని భావించిన కంగన.. సినిమా విడుదలను వాయిదా వేద్దామని నిర్మాత ఏక్తా కపూర్‌ను కోరారు. కానీ ఇందుకు ఏక్తా ఒప్పుకోలేదు. దాంతో హృతిక్ అభిమానులు సోషల్‌మీడియాలో కంగనపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీని గురించి ఏక్తా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘కామెంట్స్ మొదలయ్యాయి. సినిమా ఎప్పుడు విడుదల చేయాలన్నది ఓ నిర్మాతగా అది నా నిర్ణయం. అందరితో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఎవ్వరూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకండి’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ రంగోలీ హృతిక్ రోషన్‌కు చురకలంటించారు. ‘నేరుగా పోరాడే ధైర్యం లేక వెనక నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడేవారి గురించి ఏం చెప్తాం? నువ్వు, నీ పీఆర్వో కంగనను ఎంతగా అవమానించాలని చూస్తే.. తను అంతగా మిమ్మల్ని తొక్కిపడేస్తుంది. కంగనకు కూడా సొంత నిర్మాణ సంస్థ ఉంది. తనకు ఎప్పుడు సినిమా కావాలంటే అప్పుడు విడుదల చేసుకుంటుంది. కానీ కొందరు పప్పూలు అలాగే మిగిలిపోతారు. అలాంటివారికి కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. హృతిక్.. చూస్తూ ఉండు. కంగన నిన్నేం చేస్తుందో. ‘మెంటల్ హై క్యా’ సినిమాను జులై 26న విడుదల చేయొద్దని కంగన.. ఏక్తాను కోరింది. కానీ ఆమె నిర్మాత కావడంతో చివరి మాట తనదే అవుతుంది. ఏక్తా.. హృతిక్‌కు చిన్ననాటి స్నేహితురాలు కాబట్టి అతనితో అన్నీ మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చింది. ఏక్తాను ఏమీ అనలేక హృతిక్ పరోక్షంగా కంగనను టార్గెట్ చేస్తున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతగా కంగనను టార్చర్ పెట్టాలని చూసినా తను నీకున్న కొవ్వంతా కరిగించేస్తుంది. ఇప్పటికైనా బాగుపడు. అందరికీ ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. కంగనకు నష్టం కలగనంతవరకు ఆమె ‘సూపర్ 30’ సినిమా గురించి కానీ అందులోని నటీనటుల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు’ అని పేర్కొన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడేవారి గురించి ఏం చెప్తాం?
Related tags :