తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయలేరని మాజీ కేంద్ర మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలావరకూ ప్రాంతీయ పార్టీలు భాజపా లేదా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాయని వివరించారు. శుక్రవారం దిల్లీలో జాతీయ మీడియాతో దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘‘భాజపా, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇలాంటి కూటమి అసాధ్యం. ఎందుకంటే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌కు లేదా మాకు మద్దతిస్తున్నాయి. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయన గోడ మీద పిల్లి లాంటి వారు, అవకాశవాది’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మిగతా రెండు విడతలు మే 12, 19 తేదీల్లో జరగనుండగా, ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి.
కేసీఆర్ ఫ్రంట్ నిలబడటం కష్టమే!
Related tags :