మాజీ క్రికెటర్, దిల్లీ తూర్పు నియోజకవర్గ భాజపా అభ్యర్థి గౌతం గంభీర్.. తనకు వ్యతిరేకంగా అశ్లీల, అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను పంచుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషీ ఆరోపిస్తూ కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. గంభీర్‌కు మద్దతుగా నిలిచారు. గంభీర్ అటువంటి వ్యక్తి కాదని వారు ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘నిన్న చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా గౌతం గంభీర్ తెలుసు. మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు’ అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. ‘గౌతమ్ గంభీర్‌పై వస్తున్న ఈ ఆరోపణల గురించి తెలుసుకుని నేను షాకయ్యాను. ఆయన గురించి నాకు బాగా తెలుసు.. ఆయన మహిళల గురించి ఎప్పటికీ చెడుగా మాట్లాడరు. ఆయన ఈ ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అన్నది వేరే విషయం.. కానీ, ఆయన వీటన్నింటికీ అతీతంగా ఉంటారు’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై గంభీర్ తాజాగా మరోసారి స్పందించారు. ‘అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌నకు ఇదే నా సవాలు.. ఈ కరపత్రాలతో నాకు సంబంధం ఉందని మీరు నిరూపిస్తే నేను ప్రజల మధ్యే ఉరి వేసుకుంటాను. రుజువు చేయలేకపోతే కేజ్రీవాల్ రాజకీయాలను విడిచిపెట్టాలి. నా సవాలును స్వీకరిస్తారా?’ అని ట్వీట్ చేశారు.
గంభీర్‌కు లక్ష్మణ్ మద్దతు
Related tags :