ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టాప్ 10లో చోటు దక్కించుకుంది. 2019 సంవత్సరానికి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు, గ్రీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి. కాగా.. అమెరికా, యూకే నుంచి ఏ విమానాశ్రయాలు టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌హెల్ప్ విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే జరిపి ఈ జాబితా రూపొందించింది. 2015 నుంచి ఎయిర్హెల్స్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి హమద్, టోక్యో, ఏథెన్స్ విమానాశ్రయాల్లో వరుసగా టాప్ 3లో ఉంటున్నాయి. వీటితో పాటు ఎయిర్లైన్లకు ర్యాంకింగ్ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా ఖతార్ ఎయిర్వేస్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికన్ ఎయిర్‌లైన్స్ రెండు, ఏరోమెక్సికో మూడో స్థానం దక్కించుకున్నాయి. టాప్ 10 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..
1. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఖతార్
2. టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్
3. ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్
4. అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రెజిల్
5. గాన్స్ లెచ్ వలేసా ఎయిర్‌పోర్టు, పోలాండ్
6. షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం, రష్యా
7. షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్, సింగపూర్
8. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భారత్
9. టెనెరిఫె నార్త్ ఎయిర్‌పోర్టు, స్పెయిన్
10. విరాకోపస్/కాంపినస్ అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రెజిల్