Agriculture

మీ పంటభూమి మీద పన్నులు ఇలా లెక్కిస్తారు

How are taxes on agricultural land calculated in India

సాధార‌ణంగా గ్రామీణ ప్రాంతాల‌లోని వ్య‌వ‌సాయ భూముల‌పై మూల‌ధ‌న లాభాల ప‌న్ను వ‌ర్తించ‌దు. వివిధ స్థానిక ప్ర‌భుత్వాల ప‌రిధిలో అస‌లు ఎలా వ్య‌వ‌సాయ భూముల‌ను ప‌రిగ‌ణిస్తారో, వీటిపై ఎలా మూల‌ధ‌న లాభాల ప‌న్ను వ‌ర్తిస్తుందో తెలుసుకుందాం. కొత్త జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 10 వేల జ‌నాభా క‌లిగిన మున్సిపాలిటీ లేదా కంటోన్మెంట్ బోర్డ్ ప‌రిధికి ఆవ‌ల గ‌ల భూములను వ్యవ‌సాయ భూములుగా ప‌రిగ‌ణించ‌రు. కావున వీటిపై ప‌న్ను ప‌డదు. అలాగే, 10 వేల‌ను మించి ల‌క్ష లోపు జ‌నాభా గ‌ల మున్సిపాలిటీ ప‌రిధికి 2 కిలో మీట‌ర్ల లోపు గ‌ల భూముల‌ను వ్య‌వ‌సాయ భూములుగా ప‌రిగ‌ణించ‌రు. అలాగే ల‌క్ష మించి 10 ల‌క్ష‌ల‌లోపు జ‌నాభా గ‌ల మున్సిపాలిటీ/ కార్పోరేష‌న్ లో 6 కిలోమీట‌ర్ల లోపు గ‌ల‌ భూముల‌ను గ్రామీణ వ్య‌వ‌సాయ భూములుగా ప‌రిగ‌ణించ‌రు, కాబ‌ట్టి వీటిపై ప‌న్ను ప‌డ‌దు. అలాగే 10 ల‌క్ష‌ల జనాభా మించితే మాత్రం 8 కిలో మీట‌ర్ల ప‌రిధికి ఆవ‌ల గ‌ల భూముల‌పై ఎలాంటి ప‌న్ను ప‌డ‌దు. పై నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక‌సారి సంబంధిత భూమి, గ్రామీణ వ్య‌వ‌సాయేత‌ర భూమిగా ప‌రిగ‌ణిస్తే, దీనిలో నిర్మించే నివాస స‌ముదాయాల‌లో, లేదా జాతీయ ర‌హ‌దారి అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్ఏఐ), ఆర్ఈసీఐ జారీ చేసిన బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. వీటిలో మీరు పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మూల‌ధ‌న లాభాలపై ఆర్జించే ప‌న్ను నుంచి మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.