యువ కథానాయకుడు నాగశౌర్య కొత్త సినిమా ఆరంభమైంది. ఇందులో ఆయన సరసన మెహరీన్ నటించనున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమణ తేజ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఐరా నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. తన సొంత నిర్మాణ సంస్థలో కొత్త ప్రాజెక్టును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నాగశౌర్య ట్వీట్ చేశారు. ‘నర్తనశాల’ తర్వాత నాగశౌర్య ‘ఓ బేబీ’ సినిమాలో నటిస్తున్నారు. సమంత కథానాయికగా పాత్ర పోషిస్తున్నారు. నందినిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నారు. లక్ష్మి, రావు రమేశ్, ఊర్వశి, రాజేంద్ర ప్రసాద్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
జంట కుదిరింది
Related tags :