జుట్టుకు తగిన పోషణను అందివ్వడానికి హెయిర్ ఆయిల్ మసాజ్ చేయడం ఎంతో ముఖ్యంగా సూచించబడుతుంది. కొన్ని తరాలుగా మనం పాటిస్తున్న అంశాలలో ఇది ప్రధానమైనదిగా ఉంది కూడా. అందులో కొబ్బరి నూనె మసాజ్ అనేది అందరికీ సుపరిచితం. ఇది మీ జుట్టు సంరక్షణకు, పెరుగుదలకు సూచించదగిన గొప్ప మార్గంగా చెప్పబడుతుంది. అయితే, కొన్ని సాధారణ మార్పులతో, ఇదే హెయిర్ ఆయిల్ మసాజ్ తో పుష్కలంగా ప్రయోజనాలను పొందవచ్చునని చెప్పబడింది. మీ జుట్టుకు వాడే నూనెను ఇతర నూనెలు మరియు పదార్ధాలతో జోడించడం మూలంగా, దాని ప్రయోజనాలను మరింత రెట్టింపుతో పొందవచ్చునని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. క్రమంగా మీ జుట్టు సంరక్షణా చర్యలను తదుపరి స్థాయికి తీసుకుని వెళ్ళగలరు. ఇది మీ జుట్టుకు పోషణకు, సంరక్షణకు మాత్రమే కాకుండా, వివిధ జుట్టు సమస్యలను పరిష్కరించడంలో కూడా ఉత్తమంగా సహాయపడుతుంది. చుండ్రు సమస్య నుండి జుట్టు పెరుగుదలను పెంచడం వరకు, తెల్లటి జుట్టును నివారించడం నుండి తల మీది దురదలను పండ్లను నిర్వహించడం వరకు ఈ నూనెలు, ఉత్తమ ప్రయోజనాలను అందివ్వగలవని చెప్పబడుతుంది. క్రమంగా, ఈ నూనెలలో కలపదగిన పదార్ధాల అద్భుతమైన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని, వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొనేందుకు కొన్ని డై హెయిర్ ఆయిల్ రెసిపీలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది.
1. జుట్టురాలే సమస్యకు కొబ్బరి నూనె, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి రెసిపీ :
జుట్టు రాలకుండా నిరోధించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుంది. కొబ్బరి నూనె, జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకునిపోయి పనిచేస్తుంది. అదేవిధంగా, ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది., మరియు జుట్టు రాలిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది మరియు మీ జుట్టుకు షైనింగ్ జోడిస్తుంది. లావెండర్ నూనెలోని యాంటీ ఫంగల్ గుణాలు జుట్టుకు పోషణను అందివ్వడమే కాకుండా, జుట్టు రాలిపోకుండా కూడా నివారించగలదు. కావలసిన పదార్ధాలు : • 6 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె • 1 చిన్న ఉల్లిపాయ • 2 వెల్లుల్లి రెబ్బలు • కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ (ఆప్షనల్) తయారుచేయు విధానం : • ఒక పాన్లో కొబ్బరి నూనెను తీసుకుని తక్కువ మంట మీద వేడి చేయండి. • ఉల్లిపాయలను సన్నగా తరిగి, పాన్ కు కలపండి. • వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి పాన్ కు జోడించి, మిశ్రమంగా కలపండి. • నూనె మరిగే వరకు సన్నని మంట మీద ఉంచాలి. • తరువాత దీన్ని మంటమీద నుండి పక్కకుతీసి, చల్లారనివ్వాలి. • అందులో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి మరలా మిశ్రమంగా చేయాలి. • ఈ నూనెను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేయండి. • మీ జుట్టు పొడవును బట్టి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. • మీ తలపై కొద్ది కొద్దిగా నూనెను వేస్తూ, కొన్ని నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేయండి. మరియు మీ జుట్టు మొత్తానికి పట్టించండి. • మసాజ్ చేసిన పిదప, 30 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి. • ఆ తరువాత తలస్నానం చేసి, గాలికి ఆరనివ్వండి. • తలస్నానానికి సాధారణ షాంపూ లేదా సహజసిద్దమైన పదార్దాలను వినియోగించండి.
2. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే మందార, కొబ్బరి నూనె మరియు బాదం నూనె రెసిపీ :
మందారలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, ఇది తలపై చర్మానికి పోషణను అందివ్వడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. మరియు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది, ఇది సమతలంగా అనువర్తించినప్పుడు, కొబ్బరి నూనె జుట్టు కుదుళ్ల లోనికి చొచ్చుకొనిపోయి హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందిస్తుంది. బాదంనూనెలో విటమిన్- ఇ సమృద్ధిగా ఉన్న కారణాన, బలమైన మరియు ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించగలదు. కావలసిన పదార్ధాలు : • 1/2 కప్పు మందార ఆకులు • 2 మందార పువ్వులు • 1/4 కప్పు కొబ్బరి నూనె • 1/4 కప్పు బాదం నూనె అనుసరించు విధానం : • మందార పువ్వులను, ఆకులను బాగా కడిగి వాటిని ఎండలో పూర్తిగా ఆరనివ్వాలి. • ఒక పాన్లో కొబ్బరి నూనె , బాదం నూనె వేసి మీడియం మంట మీద కాగనివ్వాలి. • ఆ పాన్లో ఎండిన మందార ఆకులను, పువ్వులను చేర్చి బాగా కలియబెట్టాలి. • దీనిని 5 నిమిషాలపాటు సన్నని మంటమీద ఉంచి, ఆపివేయాలి. • మిశ్రమాన్ని చల్లారనివ్వండి. • చల్లారిన తర్వాత, మిశ్రమాన్ని బాగా పిండి, నూనెను వేరుచేయాలి. • మీ తలపై కొద్ది కొద్దిగా నూనె వేస్తూ, మృదువుగా మసాజ్ చేయండి. మరియు మీ జుట్టు మొత్తానికి పట్టించండి. • మసాజ్ చేసిన పిదప, 30 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి. • ఆ తరువాత సల్ఫేట్ రహిత షాంపూ వినియోగించి తలస్నానం చేసి, గాలికి ఆరనివ్వండి.
3. చుండ్రు చికిత్సకు వేప మరియు కొబ్బరి నూనె రెసిపీ :
వేప నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్న కారణాన, చుండ్రు కారక ఫంగస్ ఎదుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. క్రమంగా చుండ్రు నివారించబడుతుంది. దీనితోపాటుగా, కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి, ఇది దురద మరియు చిరాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కావలసిన పదార్ధాలు : • 1 టీస్పూన్ వేప నూనె • 1 టీస్పూన్ కొబ్బరి నూనె అనుసరించు విధానం : • రెండు నూనెలను ఒక గిన్నెలోనికి తీసుకుని, మిశ్రమంగా కలుపుకోవాలి. . • మీ తలపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కొన్ని నిముషాలపాటు మృదువుగా మసాజ్ చేయండి. • తరువాత జుట్టుమొత్తానికి పట్టించండి. • 20 నుండి 25 నిమిషాలపాటు అలానే వదిలేయండి. • తేలికపాటి షాంపూ మరియు గోరువెచ్చని నీటిని ఉపయోగించి తలస్నానం చేయండి. 4. తెల్లజుట్టు నివారించడానికి సూచించదగిన కొబ్బరి నూనె మరియు కరివేపాకు ఆకులు రెసిపీ : కొబ్బరి నూనె లో కరివేపాకు వేసి, బ్లెండ్ చేసి జుట్టుకు పట్టించడం ద్వారా, ప్రోటీన్ నష్టం నిరోధించడంలో సహాయపడుతుంది. మరియు తెల్లజుట్టును తగ్గించడంలో సహాయపడుతుంది. కావలసిన పదార్ధాలు : • ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు • 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె అనుసరించు విధానం : • ఒక పాన్లో కొబ్బరి నూనెను వేసి తక్కువ మంట మీద వేడిచేయాలి. • కరివేపాకు ఆకులను పాన్ కు జోడించండి. • ఈ మిశ్రమాన్ని ఒక నల్లటి అవశేషం ఏర్పడడం మొదలుపెట్టే వరకు వేడిచేయండి. • తరువాత మంటను ఆపివేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. • ఈ మిశ్రమాన్ని బాగా షేక్ చేయండి. • మీ తలపై కొద్దిగా నూనెని వేసి, మృదువుగా మసాజ్ చేయండి. మరియు మీ జుట్టు మొత్తానికి పట్టించండి. • 30 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి. • తరువాత, మీ జుట్టును సల్ఫేట్ రహిత షాంపూ వినియోగించి తలస్నానం చేయండి. 5. తలమీది దురద నుండి ఉపశమనానికి, పుదీనా నూనె మరియు ఆలివ్ ఆయిల్ రెసిపీ : పుదీనా నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలమీద దురదని తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పబడుతుంది. అదేవిధంగా ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, తల చర్మం మీద దురదను, మరియు చికాకు తగ్గించడంలో కీలకపాత్ర పోషించగలవు. కావలసిన పదార్ధాలు : • 1/2 టీస్పూన్ పెప్పర్మింట్ ఆయిల్ • 1 1/2 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ అనుసరించు విధానం : • రెండు పదార్ధాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలపండి. • ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేయండి. • క్రమంగా 5 నిమిషాలపాటు మసాజ్ చేసి, తరువాత తల మొత్తానికి పట్టించండి. • ఒక గంటపాటు అలానే వదిలేయండి. • యధావిధిగా షాంపూ అనుసరించండి. 6. దెబ్బతిన్న జుట్టు చికిత్సకు అవకాడో మరియు కొబ్బరి నూనె రెసిపీ : కొబ్బరి నూనె జుట్టు యొక్క ప్రోటీన్ నష్టాన్ని నిరోధిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి తగిన పోషణను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే అవకాడో, జుట్టులో తేమను నిలిపి ఉంచడంలో ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కావలసిన పదార్ధాలు : • 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె • 1 పండిన అవకాడో అనుసరించు విధానం : • ఒక బౌల్లో అవకాడోను తీసుకుని గుజ్జులా చేసి మ్యాష్ చేయాలి. • దీనికి కొబ్బరి నూనెను జోడించి, బాగా మిశ్రమంగా కలపాలి. • ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేసి, మర్దన చేయండి. మరియు మీ జుట్టు మొత్తానికి పట్టించండి. • షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేయండి. • 30 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి. • తేలికపాటి షాంపూ మరియు చల్లటి నీటిని ఉపయోగించి మీ జుట్టుకు తలస్నానం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం, పైన చెప్పిన రెసిపీలలో, మీ సమస్యకు అనుగుణంగా రెసిపీని ఎంచుకుని, కనీసం వారానికి ఒకసారైనా అనుసరించేలా ప్రణాళికలు చేసుకోండి.