Devotional

శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ

Devotees rush to Srisailam temple creating huge rush

శ్రీశైల దేవస్థానంలో పోటెత్తిన భక్తుల రద్దీ

శని ఆదివారాలు సెలవు రోజులు కావడంతో ఆంధ్రా తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు .

శ్రీశైలం చేరుకున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలను సమర్పించి, వేకువజామున పాతాళగంగలో స్నానాలు ఆచరించి అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు .

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సుమారుమూడు నాలుగు గంటల సమయం దర్శనానికి టైం పట్టింది .

బారులు తీరిన క్యూ లైన్లలొ భక్తులు శివనామం జపిస్తూ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అనుకుంటూ శివనామం జపిస్తూ భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు .

భక్తులు స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమాభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు .

అనంతరం భక్తులు శ్రీశైల దేవస్థానం ఆలయం లోపల గల గోశాలను సందర్శించారు .

శ్రీశైల దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు .

శ్రీశైల దేవస్థానంలో గల ఉద్యానవనాలలొ భక్తులు సేద తీర్చుకున్నారు

శ్రీశైల దేవస్థానం చుట్టుపక్కల గల సాక్షిగణపతి, పాలదార పంచదార, హటకేశ్వరం, శిఖరం ,అన్ని ప్రాంతాలను వచ్చిన భక్తులు సందర్శించారు .