Fashion

పెదవులకు లిప్‌స్టిక్ బదులు…

hello pretty...here is how you can safeguard your lips from cracking

-రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. ఇలా వారంరోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

-గుప్పెడు గులాబీ రేకుల్ని ముద్దగా చేసుకుని దానికి చెంచా వెన్న కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. తేనె పంచదార ఆలివ్ ఆయిల్‌ల మిశ్రమాన్ని పెదాలకు రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలిగిపోతాయి.

-కొందరి పెదవులు నలుపు రంగులో ఉన్నాయని బాధపడుతుంటారు. బీట్‌రూట్ రసాన్ని ఉదయాన్నే పెదాలకు రాసుకుంటే పెదాలు మృదువుగా తయారవుతాయి. ఇలా కొన్ని రోజులు చేస్తే పెదాలపై ఉన్న నలుపు రంగు తొలిగిపోతుంది. ఈ ప్రయత్నం వల్ల పెదాల పగుళ్లు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

-పెదవులు మరింత అందంగా కనిపించాలంటే క్రీములు, మర్దన నూనెలు రాసుకుంటే సరిపోదు. వీలైనప్పుడల్లా కొత్తిమీర, పుదీన, క్యారెట్ జ్యూసులు తాగుతుండాలి. వీటివల్ల చర్మానికి కొత్త కాంతి వస్తుంది. ఆకుకూరలు తినడం వల్ల కూడా చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. పెదాలు పగులకుండా ఉంటాయి.