Food

ఈ ఆహారం అలర్జీలను దూరం చేస్తుంది

Here are the 5 best anti allergic foods that should be in your diet

సీజనల్ మార్పుల కారణంగా తలెత్తే, దగ్గు, తుమ్ములు, కఫం, దద్దుర్లు మరియు ఇతరత్రా అలర్జీ ఆధారిత ఆరోగ్య సమస్యలు మిమ్ములను మీ దైనందిక కార్యకలాపాల నుండి దూరం చేస్తుంటాయి, అవునా ? కానీ, వీటితో పోరాడేందుకు సూచించదగిన ఉత్తమ అలెర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలు కూడా అనేకం ఉన్నాయి. అటువంటి ఆహార పదార్ధాలలో కొన్నింటిని ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. ఈ అలర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోవడం మూలంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, అనేకరకాల అలెర్జీ లక్షణాలు సులభంగా తగ్గుముఖం పట్టగలవని సూచించబడుతుంది. ఏ ఆహార ప్రణాళిక కూడా అలర్జీలకు అంతిమ చికిత్స కాజాలదు. కానీ విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న పండ్లు మరియు కూరగాయలు కొన్ని రకాల అలర్జీలతో పోరాడడం లేదా నిరోధించడం చేయగలవు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలతో ప్యాక్ చేసి, సీజనల్ అలర్జీల నుంచి కూడా మిమ్మల్ని కాపాడగలవని సూచించబడింది. అయితే, పాలు, వేరుశెనగ, సోయా ఉత్పత్తులు, చేపలు, షెల్ ఫిష్ మొదలైన అనేక రకాల ఆహారాల పరంగా కొందరు వ్యక్తులు అలర్జీలను కలిగి ఉండడాన్ని మీరు ఇదివరకే విని ఉండవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కొన్ని ప్రత్యేకమైన అలర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా, కొన్ని రకాల అలెర్జీ లక్షణాలను నిర్వహించడానికి, మరియు తగ్గించడానికి సహాయపడుతాయని చెప్పబడింది. ఈ ఆహార పదార్ధాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించగలవు. అనేకరకాల అలర్జీలను నియంత్రించడం కొరకు, ఆరోగ్యవంతమైన సంపూర్ణ ఆహారం సహాయకారిగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న ఆలివ్ నూనె మరియు చేప వంటి ఆహారాలు శోథ నిరోధక తత్వాలను కలిగి ఉండి, అలర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. మరియు ఉత్తమ అలెర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలలో ప్రధానమైనవిగా పరిగణించబడుతాయి కూడా. మీ ఆహార ప్రణాళికలో భాగంగా జోడించదగిన ఉత్తమ అలర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచబడ్డాయి. అవేమిటో తెలుసుకునేందుకు, వ్యాసం చదవాలి

1. ఒమేగా-3 కొవ్వులు ఎక్కువగా, ఒమేగా-6 కొవ్వులు తక్కువగా :
ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా తీసుకోవడం మూలంగా, అలర్జీలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలలో తేలింది. ఈ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మూలాన అలర్జీ లక్షణాలను తగ్గించగలవని చెప్పబడుతుంది. మరోవైపు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల విషయానికి వస్తే, ఇది ఇన్ఫ్లమేటరీ ప్రోస్టాగ్లాండిన్స్ ను ఉత్పత్తి చేయడం ద్వారా శరీరంలో శోధను పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది. క్రమంగా అలెర్జీ లక్షణాలను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీనిలో వేరే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్న కారణంగా, మీ ఆహార ప్రణాళిక నుండి ఒమేగా 6 కొవ్వులను పూర్తిగా తొలగించడానికి బదులుగా, దీని వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించబడుతుంది.

2. రోస్మారినిక్ ఆమ్లం కలిగి ఉన్న మూలికలు :
అలెర్జీ ప్రతిచర్యలను అణచివేయడంలో రోస్మారినిక్ ఆమ్లం ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పబడుతుంది. ఇందులోని ఇమ్యూనోగ్లోబ్యులిన్ ప్రతిస్పందనలు, ల్యూకోసైట్ల ద్వారా కలిగే వాపును అణచివేయడానికి దోహదపడుతాయి. ఈ రోస్మారినిక్ ఆమ్లం ఒరేగానో, లెమన్ బాం, రోజ్మేరీ, సేజ్, పుదీనా, వాము వంటి మూలికలలో లభిస్తుంది.

3. క్వెర్సెటిన్ కలిగి ఉన్న ఆహారాలు :
బయోఫ్లేవొనోయిడ్ క్వెర్సెటిన్ అనేది ఒక ముఖ్యమైన అలర్జీ వ్యతిరేక పోషకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ హిస్టమైన్ గుణాలు ఉన్నట్లుగా పరిశోధనలలో తెలుస్తూ ఉంది. ఈ గుణాలు అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనానికి సహాయపడగలవని కూడా అధ్యయనాలు సూచించాయి. క్వెర్సెటిన్ యొక్క మంచి ఆహార మూలాలుగా ఎరుపు మరియు పసుపు ఉల్లిపాయలు, ఆపిల్, రాస్బెర్రీస్, చెర్రీలు, క్రాన్బెర్రీస్, బ్రోకోలీ, ఎరుపు రంగు ద్రాక్ష, సిట్రస్ పండ్లు, రెడ్ వైన్ మరియు టీ ఉన్నాయి.

4. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు :
విటమిన్ ‘ C ‘ అనేది వాపు తగ్గించడానికి సహాయపడగల, సమర్ధవంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పబడుతుంది. ఇది అలర్జీలతో బాధపడుతున్న ప్రజలలో రోగ లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండగలదు. శరీరంలో హిస్టామిన్ విడుదలను తగ్గించడం, హిస్టమైన్ ను వేగంగా విచ్ఛిన్నం చేయడం మొదలైన వాటిలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుందని చెప్పబడుతుంది. హిస్టామిన్ అనేక అలెర్జీ ప్రతిచర్యలకు కారణంగా ఉంటుంది.

5. సెలీనియం ఎక్కువగా ఉండేలా చూసుకోండి :
అలర్జీలను తగ్గించడంలో సెలీనియం అత్యుత్తమ ప్రభావాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే ప్రత్యేక ప్రోటీనులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. పుట్టగొడుగులు, కాడ్, రొయ్యలు వంటి వాటిలో సెలీనియం అధికంగా ఉంటుంది. సెలీనియం ఉండే ఆహారాలను తరచుగా తీసుకోవడం మూలంగా అలర్జీలను