కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పలు సందర్భాల్లో వ్యక్తిగతంగా మాటల యుద్ధానికి దిగిన వీరిద్దరి చిత్రాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కంగన నటించిన ‘మెంటల్ హై క్యా’, హృతిక్ రోషన్ చిత్రం ‘సూపర్ 30’లను జులై 26న విడుదల చేయనున్నట్లు రెండు చిత్ర బృందాలు ప్రకటించాయి. దీంతో బయటేకాదు బాక్సాఫీసు వద్ద కంగన, హృతిక్ ఒకరిపై ఒకరు పోరాటానికి సిద్ధమయ్యారని అందరూ అనుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కావడంతో హృతిక్ అభిమానులు కంగనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగన సోదరి రంగోలి మరింతగా ట్విటర్ వేదికగా హృతిక్‌పై విరుచుకు పడ్డారు. ఈ గొడవ పెద్దదయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో హృతిక్ తన సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అనవసరమైన టార్చర్‌ను తట్టుకోలేకే నేను నా ‘సూపర్ 30’ విడుదలను వాయిదా వేస్తున్నాను’’ అని ప్రకటించారు హృతిక్. ‘‘ఈ మీడియా సర్కస్ వల్ల నేను అనుభవిస్తున్న టార్చర్ కారణంగా నా ‘సూపర్ 30’ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను. మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాసరే మరో మంచి తేదీన విడుదల చేయాలని నా నిర్మాతలను కోరాను. కొంతమంది చాలా కాలంగా నన్ను వేధిస్తున్నా, ఎంతో ఓపిగ్గా ముందుకెళుతున్నాను’’ అని ట్వీట్ చేశారు హృతిక్.
వాళ్ల సర్కస్ టార్చర్ భరించలేక…
![Hrithik calls kangana and rangoli circus. postpones super30 movie release date. Hrithik calls kangana and rangoli circus. postpones super30 movie release date.](;https://images.abplive.in/v2/aHR0cHM6Ly9zdGF0aWMuYWJwbGl2ZS5pbi93cC1jb250ZW50L3VwbG9hZHMvMjAxOS8wNS8wNzE3MDgzNC9zaXRlLmpwZyM2NDA6NDgwI3Jlc2l6ZSNqcGVn/site.jpg)
Related tags :