Videos

తల్లికి గుడి కట్టిన తూగో వ్యక్తి

Indian Man From East Godavari Builds Temple For His Mother

నవ మాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లి రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేనిది. అలాంటి తల్లి అనారోగ్యంతో కన్ను మూస్తే గుడి కట్టించి పూజలు చేస్తున్నాడో కుమారుడు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన సాగర్‌ కుటుంబం కోసం తల్లి చేసిన త్యాగాలను గుర్తుంచుకునేలా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మను స్మరించుకుంటూ పేదలకు సేవలు చేస్తున్నారు. రోజూ కుటుంబీకులతో కలిసి అక్కడే గడుపుతున్నారు. ఎంత చేసినా అమ్మ రుణం తీర్చుకోలేమని సాగర్‌ చెబుతున్నారు.